జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం | winner is jrg team | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం

Jan 4 2017 12:21 AM | Updated on Oct 2 2018 8:39 PM

జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం - Sakshi

జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం

కొయ్యలగూడెం : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేష న్‌ కోటగిరి విద్యాధరరావు ఫౌండేష న్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కొయ్యలగూడెంలో ఫ్లో(ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆఫ్‌ వెస్ట్‌ గోదావరి)–2017 మ్యాచ్‌ నిర్వహించారు.

కొయ్యలగూడెం : జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేష న్‌ కోటగిరి విద్యాధరరావు ఫౌండేష న్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కొయ్యలగూడెంలో ఫ్లో(ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆఫ్‌ వెస్ట్‌ గోదావరి)–2017 మ్యాచ్‌ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం– నరసాపురం జట్లు హోరాహోరీగా ఈ ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. చివరకు జంగారెడ్డిగూడెం జట్టు 1–0 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. 1.30 గంటల వ్యవధిలో ఏ ఒక్క జట్టు కూడా గోల్‌ సాధించలేకపోవడంతో ఆటను అర్ధ గంట పాటు పొడిగించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన జంగారెడ్డిగూడెం జట్టులోని సభ్యుడు పవ న్‌ ఆట ఆఖరి నిమిషంలో గోల్‌ సాధించి విజయాన్ని చేకూర్చాడు. టోర్నీ నిర్వాహకులు ఫౌండేష న్‌ వ్యవస్థాపకుడు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ మ్యాచ్‌ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మొత్తం 15 లీగ్‌మ్యాచ్‌లో భాగంగా 9వ మ్యాచ్‌ కొయ్యలగూడెంలో నిర్వహించామని ఫ్లో సీఈవో ఆర్‌.రాజేష్‌ రావూరి, జిల్లా ఫుట్‌బాల్‌ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావులు తెలిపారు. 16న పాలకొల్లు, 17న నరసాపురంలో సెమీ ఫైనల్స్, 18న ఏలూరులో ఫైనల్స్‌ జరపనున్నామని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఏఎంసీ చైర్మపి.రామారావు, అఫెడా మాజీ డైరెక్టర్‌ గొడవర్తి విద్యాసాగర్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement