'టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తా' | will work for Trs as campaign worker, says Janareddy | Sakshi
Sakshi News home page

'టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తా'

Jun 23 2016 6:48 PM | Updated on Aug 15 2018 9:30 PM

'టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తా' - Sakshi

'టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పనిచేస్తా'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి సవాల్‌ విసిరారు.

నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి సవాల్‌ విసిరారు. గురువారం ఆయన నల్లగొండలో  విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల గారడీతో పాలన సాగిస్తుందన్నారు. 

తెలంగాణలోని ప్రాజెక్టులు ఒక పంటకు నీరు ఇచ్చేందుకు డిజైన్‌ చేసినవని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు నీరు ఇస్తే తాను టీఆర్‌ఎస్‌లో ప్రచార కార్యకర్తగా పని చేస్తానని జానారెడ్డి  వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని కొందరు తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement