జాబ్‌ మేళాకు విశేష స్పందన | Widespread job fair | Sakshi
Sakshi News home page

జాబ్‌ మేళాకు విశేష స్పందన

Aug 4 2016 6:18 PM | Updated on Aug 20 2018 6:18 PM

జాబ్‌ మేళాకు విశేష స్పందన - Sakshi

జాబ్‌ మేళాకు విశేష స్పందన

స్థానిక పాత రిమ్స్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని ఇన్‌ఛార్జి ఉపాధి కల్పనాధికారి ఎస్‌.వెంకట రమణ తెలిపారు.

కడప కోటిరెడ్డి సర్కిల్‌:
స్థానిక పాత రిమ్స్‌లోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందని ఇన్‌ఛార్జి ఉపాధి కల్పనాధికారి ఎస్‌.వెంకట రమణ తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్స్‌ కంపెనీలో ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలకు 65 మంది హాజరు కాగా, 31 మందిని ఎంపిక చేశామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఈనెల 8న తిరుపతిలో శిక్షణకు హాజరు కావాలని, అనంతరం వీరంతా జిల్లాలో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు.  ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి ఫరూఖ్‌బాష, జేఈఓ దోనప్ప, గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement