బ్యాంకర్లు ముందుకు వస్తే ఆన్‌లైన్‌ సేవలు | we provide online services for bankers | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు ముందుకు వస్తే ఆన్‌లైన్‌ సేవలు

Aug 1 2016 12:10 AM | Updated on Sep 4 2017 7:13 AM

బ్యాంకర్లు సహకరిస్తే టీటీడీ కల్యాణమంటపాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందించడానికి టీటీడీ అనుమతి ఇస్తుందని పాలకవర్గం సభ్యుడు ఏవీ రమణ అన్నారు. ఆదివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.

  • టీటీడీ బోర్డు సభ్యుడు రమణ
  • కొడంగల్‌ :   బ్యాంకర్లు సహకరిస్తే టీటీడీ కల్యాణమంటపాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందించడానికి  టీటీడీ అనుమతి ఇస్తుందని పాలకవర్గం సభ్యుడు ఏవీ రమణ అన్నారు. ఆదివారం స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ఆయన విలేకరులతో మాట్లాడారు.  టీటీడీలో సిబ్బంది కొరత ఉన్నందున తాము ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కొడంగల్‌ ఆలయానికి వైభవోత్సవ మంటపాన్ని మంజూరు చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆలయ ధర్మకర్తలకు సూచించారు.  భక్తుల కోరిక మేరకు కొడంగల్‌ ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు,   జిల్లా నాయకుడు తిరుపతి రెడ్డి, నందారం ప్రశాంత్, అనురాధ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement