ఎల్లెల్సీకి నీటి విడుదల
తుంగభద్ర దిగువ కాల్వకు శుక్రవారం డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు.
హొళగుంద: తుంగభద్ర దిగువ కాల్వకు శుక్రవారం డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ప్రతి రెండు గంటలకు వంద క్యూసెక్కుల చొప్పున పెంచుతూపోతున్నారు. గతంలో ఫిబ్రనరి 6న కాల్వకు నీటి సరఫరాను నిలిపేశారు. తాగనీటి అవసరాల కోసం ఆంధ్ర కోటా నీటిని విడుదల చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఆంధ్ర బార్డర్(250కిమీ)కు 600 క్యూసెక్కుల నీటిపి పారించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నాటికి ఆంధ్ర పరిధి(చింతకుంట 135కిమీ)నీరు చేరే అవకాశం ఉందన్నారు. శుక్రవారం డ్యాం నీటిమట్టం 1578 అడుగుల వద్ద 3.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.