పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మాణం కలగానే మిగిలింది.
గోస్తని పొంగితే..దిగ్బంధమే!
Jul 28 2016 12:43 AM | Updated on Sep 4 2017 6:35 AM
గోస్తని పొంగితే..దిగ్బంధమే!
గోస్తనీ, దిగ్బంధం gostani,overflow,struked
పద్మనాభం: పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. పాండ్రంగి వాసులు బయటకు రావాలంటే గోస్తని దాటాలి. తగరపువలస, విశాఖపట్నం, విజయనగరం వెళ్లడానికి, పద్మనాభం రావడానికి పాండ్రంగి జంక్షన్‌లో బస్సులు ఎక్కుతుంటారు. వర్షాల సమయంలో నది గ్రామాన్ని తాకుతూ పొంగి ప్రవహిస్తుంది. నది ప్రవహించేటప్పుడు గ్రామస్తులు ఊరు దాటి వెళ్ల లేని పరిస్థితి.
చుట్టుతిరిగి వెళ్లాలన్నా చిక్కులే మునివానిపాలెం మీదుగా తగరపువలస వెళ్లాలనుకున్నా సంగి వలస గెడ్డ, బోని మీదుగా పద్మనాభం రావాలనుకున్నా మద్ది సమీపాన ఉన్న పల్లి గెడ్డపై ప్రవహించే నీరు అడ్డు వస్తుంది. గ్రామంలోప్రాథమిక పాఠశాల ఏడో తరగతి వరకే ఉంది. ఎనిమిది నుంచి పదోతరగతి వరకు ఈ గ్రామ విద్యార్థులు రేవిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లా. వర్షాకాలంలో నది ఉధతంగా ప్రవహించడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. పాండ్రంగి పంచాయతీ పరిధిలో ఉండే కొత్త కురపల్లి, పాత కురపల్లి, బర్లపేట గ్రామాల ప్రజలు పంచాయతీ పరంగా అవసరమయ్యే పనులకు పాండ్రంగి రావాలి.
సందర్శకులకు తిప్పలు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన పుణ్యగడ్డ కావడంతో ఇక్కడ అల్లూరి జననగహం, విగ్రహం, సామాజిక భవనం నిర్మించారు. ఈ స్మారక చిహ్నాలను తిలకించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నదిదగ్గరకు వచ్చే వరకూ పొంగిప్రవహిస్తుందన్న విషయం తెలియక పోవడంతో పర్యాటకులు అల్లూరి స్మారక చిహ్నాలను చూడకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. నదిలో నిర్మించిన కాజ్‌వే గోతులు పడింది.
నేతలు మారినా
ఈ గ్రామానికి చెందిన రాజాసాగి సూర్యనారాయణ రాజు ఒక విడత, ఆర్.ఎస్.డి.డి.పి.అప్పలనరసింహరాజు నాలుగు సార్లు ఎమ్యేల్యేగా పనిచేశారు. అయినప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదు. విశాఖపట్నం మాజీ ఎంపీ దగ్గుబాటి పరందేశ్వరి, భీమిలి మాజీ ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మానవ వనరుల శాఖ మంంత్రి గంటా శ్రీనివాస తమను ఎన్నికల్లో గెలిపిస్తే వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నీటిలో రాతలగా మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు.
Advertisement
Advertisement