జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసినట్లు తెలుగు గంగ డీఈ రాఘరామిరెడ్డి తెలిపారు.
వీబీఆర్ నుంచి నీటి విడుదల బంద్
Jan 22 2017 12:44 AM | Updated on Sep 5 2017 1:46 AM
వెలుగోడు: జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసినట్లు తెలుగు గంగ డీఈ రాఘరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతం వీబీఆర్‌లో 5.974 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీబీఆర్ నుంచి వన్ ఆర్, వన్ ఎల్, చెన్నై కాల్వకు అవుట్ ప్లో నిలిపేసినట్లు డీఈ తెలిపారు. కలెక్టర్ అనుమతితోనే మళ్లీ నీటిని విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
Advertisement


