నీటి కనెక్షన్లు ఉన్నవారంతా ఆగస్టు నుంచి తప్పని సరిగా మీటర్లు వాడాలని జలమండలి ఎండీ పేర్కొన్నారు.
నీటి మీటర్లు లేకుంటే కనెక్షన్ కట్
Jul 27 2016 2:35 PM | Updated on Sep 4 2017 6:35 AM
- అక్రమ నీటి కనెక్షన్లకు రెండింతల చార్జీలు
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని నీటి కనెక్షన్లు ఉన్న వారందరూ ఆగస్టు నుంచి తప్పని సరిగా నీటి మీటర్లు వాడాలని హైదరాబాద్ జలమండలి ఎండీ పేర్కొన్నారు. మీటర్లు లేని కనెక్షన్ దారులందరికీ ఆగష్టు లో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నోటీసులో మీటర్లు దొరికే ఏజెన్సీ వివరాలు ఉంటాయన్నారు. నోటీసు అందిన నెలరోజుల్లో మీటర్లు పెట్టుకోకుంటే కనెక్షన్ కట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ కనెక్షన్ దారులు రెండు నెలలలోపు మీటర్లు పెట్టుకోవాలన్నారు. అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే రెండింతలు చార్జీలు వసూలు చేస్తామన్నారు.
Advertisement


