వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలి | VSU should be shifted to new building | Sakshi
Sakshi News home page

వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలి

Nov 12 2016 2:24 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు (టౌన్‌) : విక్రమ సింహపురి యూనివర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్షుడు సాంబశివారెడ్డి డిమాండ్‌ చేశారు. వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని రెండో రోజూ శుక్రవారం వీఎస్‌యూ కళాశాల బంద్‌ నిర్వహించారు.

నెల్లూరు (టౌన్‌) : 
విక్రమ సింహపురి యూనివర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్షుడు సాంబశివారెడ్డి డిమాండ్‌ చేశారు. వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని రెండో రోజూ శుక్రవారం వీఎస్‌యూ కళాశాల బంద్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్సిటీ భవనం పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్‌ అసమర్థత వల్లే నూతన భవనంలోకి మార్చలేదన్నారు. ఇటీవల వర్సిటీకి రూ.24 కోట్లు విడుదలతో మార్గం సుగమమైందన్నారు. వర్సిటీని పట్టించుకోవాల్సిన పాలక మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్‌లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై అడిగితే ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వర్సిటీ భవనం మార్పుపై ఈ నెల 16న స్పష్టత ఇస్తామని హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమింపజేశారు. ఽఏబీవీపీ నాయుకులు జయచంద్ర, ప్రతాప్, రఘు, చైతన్యకృష్ణ, రఫి, కిరణ్, వివేక్, నరేష్, దిలిప్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement