అప్పుల బాధలో మరో కార్మికుడు ఆత్మహత్య | venkatadri suicide in madanapalle | Sakshi
Sakshi News home page

అప్పుల బాధలో మరో కార్మికుడు ఆత్మహత్య

Sep 17 2016 9:35 AM | Updated on Nov 6 2018 8:04 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టుపల్లి మారుతీనగర్‌లో నివసిస్తున్న వెంకటాద్రి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టుపల్లి మారుతీనగర్‌లో నివసిస్తున్న వెంకటాద్రి (30) అనే చేనేత కార్మికుడు శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా రొద్దం మండలం సానిపల్లికి చెందిన వెంకటాద్రికి భార్యా పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ రెండు లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలను అక్కడే వదిలేసి ప్రియురాలితో మదనపల్లి చేరి చేనేత కార్మికునిగా పని చేసేవాడు.

అయితే ఐదు రోజుల క్రితం ప్రియురాలు వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన వెంకటాద్రి అప్పులు తీర్చే మార్గం తోచక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement