వరాహిమాతకు యంత్రపూజ | varahimatha yantra pooja | Sakshi
Sakshi News home page

వరాహిమాతకు యంత్రపూజ

Nov 10 2016 10:47 PM | Updated on Sep 4 2017 7:44 PM

వరాహిమాతకు యంత్రపూజ

వరాహిమాతకు యంత్రపూజ

కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న యంత్రపూజల్లో 11వ రోజైన గురువారం వరాహిమాత యంత్ర పూజలు జరిగాయి.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న యంత్రపూజల్లో 11వ రోజైన గురువారం వరాహిమాత యంత్ర పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వరాహిమాత ప్రతిమను ముగ్గులతో తీర్చిదిద్దగా, అర్చకులు కరణం శరత్‌కుమార్, సుదర్శన కృష్ణలు పూజలు నిర్వహించారు. వరాహిమాత యంత్రపూజ చేయడం వల్ల దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని, అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని వారు పేర్కొన్నారు. వరాహిమాత ప్రతిమ చుట్టూ భక్తులు దీపాలు వెలిగించారు.




 

Advertisement
 
Advertisement
Advertisement