రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక.. భక్తులకు కీలక సూచనలు | President Murmu to visit Indrakeeladri | Sakshi
Sakshi News home page

రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక.. భక్తులకు కీలక సూచనలు

Oct 13 2026 8:05 PM | Updated on Oct 13 2026 8:08 PM

President Murmu to visit Indrakeeladri

విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (అక్టోబరు 14) ​ఇంద్రకీలాద్రికి రానున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా కొండపై వాహనాల రాకపోకలు, ప్రోటోకాల్ దర్శన వేళల్లో మార్పులు చేశారు.

  • రాష్ట్రపతి పర్యటన భద్రత దృష్ట్యా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేస్తారు. 

  • రేపు మధ్యాహ్నం నుంచి ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలనూ అనుమతించరు. 

  • అలాగే, రేపు రాత్రి 7.45 గంటల నుంచి కేటాయించిన ప్రోటోకాల్ స్లాట్‌ను కూడా పూర్తిగా రద్దు చేస్తూ, రేపు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉండే  ప్రోటోకాల్ దర్శనాలు ఒక గంట సమయం పెంచి 9 వరకు అనుమతించారు. 

  • బుధవారం సాయంత్రం వేళలకు ప్రోటోకాల్ దర్శనం టికెట్లు లేదా అనుమతులు కలిగి ఉన్న భక్తులు, ప్రముఖులు ఈ మార్పును గమనించి, తప్పనిసరిగా రేపు ఉదయం 6 నుండి 9 గంటల లోపు స్లాట్‌లోనే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement