ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్‌ | CM Vijay Visits Vijayawada's Indrakeeladri | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను దర్శించుకున్న సీఎం విజయ్‌

Oct 13 2026 4:45 PM | Updated on Oct 13 2026 5:17 PM

CM Vijay Visits Vijayawada's Indrakeeladri

విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు విజయ్‌కు ఆలయ మర్యాదలతో దేవాదాయ శాఖ అధికారులు, దుర్గగుడి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ సన్నిధిలో విజయ్‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా విజయ్‌ బాధ్యతలు స్వీకరించాక ఆయన ఆంధ్రప్రదేశ్‌కు రావడం ఇదే మొదటిసారి.

కాగా, విజయ్‌ చెన్నై నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అక్కడి నుంచి విజయ్ నేరుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. విజయ్‌ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0లోనూ పాల్గొననున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఆయన చెన్నై వెళ్తారు. 

దుర్గమ్మ సేవలో తమిళనాడు CM విజయ్ దద్దరిల్లిన విజయవాడ

ఇదీ చదవండి: ఎవరీ నేహా బోరా? దేశవ్యాప్తంగా వైరల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement