వాలీబాల్‌ జట్ల ఎంపిక | vallyball teams seclected | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ జట్ల ఎంపిక

Sep 25 2016 8:17 PM | Updated on Sep 4 2017 2:58 PM

వాలీబాల్‌ జట్ల ఎంపిక

వాలీబాల్‌ జట్ల ఎంపిక

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాల బాలికల జట్లను ఆదివారం ఎంపిక చేశారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కరీంనగర్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌–21 యువతీ యువకులకు పోటీలు నిర్వహించారు.

కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాల బాలికల జట్లను ఆదివారం ఎంపిక చేశారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కరీంనగర్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో అండర్‌–21 యువతీ యువకులకు పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 35 గ్రామాల నుంచి 120 మంది హాజరై ప్రతిభ కనబర్చారు. జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్‌ 2 వరకు నిజమాబాద్‌ జిల్లా కామారెడ్డిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు పాల్గొంటాయని సంఘం ఆధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌.వేణుకిషన్‌రావు, గిన్నె లక్ష్మణ్‌ తెలిపారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. పోటీల నిర్వహణను వాలీబాల్‌ సంఘం ప్రతినిధులు ముస్తాల రవీందర్, జి.సంజీవ్‌రెడ్డి, ఎం.రాజేందర్‌ కుమార్, దూడం రమేశ్, టి.రాజయ్య, శ్రీనివాస్‌రావు, మురళీధర్‌రెడ్డి, ప్రభాకర్, చంద్రశేఖర్, నర్సయ్య, సత్యనారాయణ, మధుకర్‌రెడ్డి, చంద్రబాబు, వీర్‌పాల్, శ్రీనివాస్, ఆశాలు, శిరీష పాల్గొన్నారు. అనంతరం జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను లక్ష్మణ్‌ ప్రకటించారు.
 
బాలుర జట్టు...
ఎస్‌.వంశీ కృష్ణ , ఎస్కే.సాజీద్‌ (రామడుగు), ఎస్‌.సాగర్‌ (జూలప్లలి), ఎల్,నVó శ్‌ (గంగాధర), కె.మహేశ్‌ (నంది మేడారం), వి.మలుపాల్‌(గట్టెపల్లి), కె.మహేశ్‌(చంజర్ల), పి.కార్తీక్‌(పెగడపల్లి), ఎన్‌.మునీందర్‌(నమిలికౌండ), ఎం.అరవింద్‌(పూడురు), ఎస్‌.గోపి(రామవరం), స్టాండ్‌ బైగా బి.సురేశ్‌(గౌరవెల్లి), జి.లక్ష్మణ్‌ (కమ్మర్‌ఖాన్‌పేట), ఎం.గణేశ్‌(పెగడపల్లి), కె.రమేశ్‌ (బోయినపల్లి) ఎంపికయ్యారు. 
 
బాలికల జట్టు...
ఓ.కీర్తన, వి.వెన్నెల, ఎస్‌.భవాని(ఆసీఫ్‌నగర్‌), సీహెచ్‌.ఐశ్వర్య, కె.అర్పిత, బి.జ్యోతి, జి.ఆమని (పెగడపల్లి), సీహెచ్‌.అశ్విని( గంగాధర), ఎం.అఖిల(గొల్లపల్లి), డి.అఖిల(కరీంనగర్‌), బి.అఖిల(వెల్గటూర్‌), బి.మల్లీశ్వరి (జూలపల్లి), స్టాండ్‌ బైగా బి.శిరీష, డి.మమత (పెగడపల్లి), డి.పూజిత(కరీంనగర్‌), ఎం.కనకమహాలక్ష్మి(ఆసీఫ్‌నగర్‌) ఎంపికయ్యారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement