హెర్నియా అని వస్తే...గర్భసంచి..! | uterus was found in the stomach of A young man | Sakshi
Sakshi News home page

హెర్నియా అని వస్తే...గర్భసంచి..!

Jun 23 2016 11:59 AM | Updated on Aug 17 2018 8:06 PM

హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది.

హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. హెర్నియాను తొలగించటంతోపాటు గర్భసంచిని బయటకు తీసి చికిత్స పూర్తి చేశారు.


ఈ విషయమై ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన కేసని..ప్రతి 5కోట్లలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అమర్నాథ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement