ఉర్దూ యూనివర్సిటీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల | urdu university semester results relese | Sakshi
Sakshi News home page

ఉర్దూ యూనివర్సిటీ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

May 31 2017 12:33 AM | Updated on Sep 5 2017 12:22 PM

ఉర్దూ యూనివర్సిటీ రెండవ సెమిస్టర్‌ ఫలితాలను మంగళవారం వైస్‌చాన్స్‌లర్‌ ముజఫర్‌ అలీ విడుదల చేశారు.

కర్నూలు సిటీ: ఉర్దూ యూనివర్సిటీ రెండవ సెమిస్టర్‌ ఫలితాలను మంగళవారం వైస్‌చాన్స్‌లర్‌ ముజఫర్‌ అలీ విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూజీ బీఏ ఎకనామిక్స్‌లో 12 మంది విద్యార్థులకు గాను 10మంది, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో 16 మందికి 16 మంది ఉత్తీర్ణులైయ్యారన్నారు. పీజీలో ఎంఏ ఇంగ్లిష్‌లో 100 శాతం(24 మంది విద్యార్థులు), ఉర్దూలో 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 17 మంది, ఎంకామ్‌లో 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో ఉర్దూ హానర్స్, ఎకనామిక్స్‌ హానర్స్, బీకామ్‌ హానర్స్, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ హానర్స్‌లో జూన్‌ 14వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement