వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గురువారం కొండాపురంలో చోటుచేసుకుంది.
వడదెబ్బతో ఉపాధి కూలీమృతి
Apr 14 2017 1:02 AM | Updated on Sep 5 2017 8:41 AM
దొర్నిపాడు: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గురువారం కొండాపురంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన షేక్‌మహబూబ్‌బాషా (47) బుధవారం కొండాపురం–భాగ్యనగరం గ్రామాల మధ్యలో జరుగుతున్న పంట కాల్వల్లో పూడికతీత పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ బషీర్ కూలీల సాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేటు వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి సులోచన, ఏపీఓ పిడుగు రాముడు గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని బంధువులు, కుటుంబసభ్యులు కోరారు.
Advertisement


