యూనిట్‌ బ్రేకర్లు ప్యాడ్‌ల మార్పు | Unit breaker pads changed at AP GENCO | Sakshi
Sakshi News home page

యూనిట్‌ బ్రేకర్లు ప్యాడ్‌ల మార్పు

Sep 29 2016 1:19 AM | Updated on Mar 28 2019 5:32 PM

యూనిట్‌ బ్రేకర్లు ప్యాడ్‌ల మార్పు - Sakshi

యూనిట్‌ బ్రేకర్లు ప్యాడ్‌ల మార్పు

ముత్తుకూరు నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్టులోని 800 మెగావాట్ల స్విచ్‌యార్డులో కరిగిపోయి, దెబ్బతిన్న యూనిట్‌ బ్రేకర్‌ ప్యాడ్‌లను బుధవారం సాహసంతో హాట్‌లైన్‌ సిబ్బంది తొలగించి, కొత్తవి అమర్చారు. విజయవాడ £ý ర్మల్‌ విద్యుత్‌కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక హాట్‌లైట్‌ సిబ్బంది శ్రీనివాసరావు, శ్రీనివాస్‌లు విద్యుత్‌ సరఫరా జరుగుతుండగానే ఈ సాహసం ప్రదర్శించారు

 
  •  హాట్‌లైన్‌ సిబ్బంది సాహసం  
 ముత్తుకూరు
నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్టులోని 800 మెగావాట్ల స్విచ్‌యార్డులో కరిగిపోయి, దెబ్బతిన్న యూనిట్‌ బ్రేకర్‌ ప్యాడ్‌లను బుధవారం సాహసంతో హాట్‌లైన్‌ సిబ్బంది తొలగించి, కొత్తవి అమర్చారు. విజయవాడ £ý ర్మల్‌ విద్యుత్‌కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక హాట్‌లైట్‌ సిబ్బంది శ్రీనివాసరావు, శ్రీనివాస్‌లు విద్యుత్‌ సరఫరా జరుగుతుండగానే ఈ సాహసం ప్రదర్శించారు. రూ.2 లక్షల విలువైన ప్రత్యేక సూట్‌ ధరించి, ఎల్తైన చోట ఉత్కంఠ పరిస్థితిలో ఆన్‌లైన్‌లో కరిగిపోయిన ప్యాడ్‌లను తొలగించి, కొత్తవి అమర్చారు. ఈ సాహసకృత్యాన్ని సీఈ చంద్రశేఖరరాజు, ఎస్‌ఈలు దేవప్రసాద్, రమేష్‌ముని, సంబంధిత విభాగపు ఇంజనీరు శ్రీనివాసరావు, ముఖ్యసంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. హాట్‌లైన్‌ సిబ్బంది నైపుణ్యాన్ని ప్రశంసించారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement