యూజీ సెకండ్‌ సెమిస్టర్‌ ఫలితాల విడుదల | ug second semister results release | Sakshi
Sakshi News home page

యూజీ సెకండ్‌ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

Sep 24 2016 11:33 PM | Updated on Sep 4 2017 2:48 PM

యూజీ ఎగ్జామినేషన్‌ సెకండ్‌ సెమిస్టర్‌ ఫలితాలను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌ శనివారం విడుదల చేశారు.

అనంతపురం టౌన్‌ : యూజీ ఎగ్జామినేషన్‌ సెకండ్‌ సెమిస్టర్‌ ఫలితాలను ఎస్కేయూ  వీసీ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌ శనివారం విడుదల చేశారు. బీఏలో 1,832 మంది హాజరుకాగా 138 మంది, బీఎస్సీలో 5,993 మందికి గాను 1,634, బీ కాంలో 7525 మందికి   1,197, బీబీఏలో 310కి  70 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 15,660 మంది పరీక్ష రాయగా 3039 మంది పాసయ్యారు.

19.41 శాతం ఉత్తీర్ణత సాధించారు.  రెక్టార్‌ శ్రీధర్, రిజిస్ట్రార్‌ ఏవీ రమణ, యూజీ ఎగ్జామినేషన్‌ డీన్‌ జీవన్‌కుమార్, కో ఆర్డినేటర్‌ అక్తార్, రీవాల్యుయేషన్‌ కో ఆర్డినేటర్‌ మునినారాయణప్ప, డిప్యూటీ రిజిస్ట్రార్‌ శ్రీరాములు నాయక్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement