రేకులు మీద పడి ఇద్దరి మృతి | Two killed in accident | Sakshi
Sakshi News home page

రేకులు మీద పడి ఇద్దరి మృతి

Oct 2 2016 10:57 AM | Updated on Sep 4 2017 3:55 PM

ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వద్ద పోలవరం కాలువ వంతెనపై ప్రమాదం జరిగింది.

ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వద్ద పోలవరం కాలువ వంతెనపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ఓ లారీ రేకుల లోడుతో విజయవాడ బయల్దేరింది. మార్గమధ్యంలో 10 మంది కూలీలు ఎక్కారు. వీరిలో ఇద్దరు రేకుల మధ్య పడుకున్నారు. లారీ గున్నంపల్లి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో రేకుల ఇద్దరి మీద పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామానికి చెందిన దిమ్మెల కృష్ణ(19), పత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామానికి చెందిన పొన్నాడ తాతారావు(50)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement