జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
జీలుగుమిల్లి(పశ్చిమగోదావరి జిల్లా): జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా టేకూరు గ్రామస్థులకు కేటాయించిన 500 ఎకరాల భూమి విషయంలో స్థానిక (పి.నారాయణపురం) గిరిజనులకు, టేకూరు నిర్వాసితులకు (గిరిజనులు) మధ్య వివాదం చెలరేగింది.
ఇరువర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో ఇద్దరికి తలలు పగిలి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కామయ్యపాలెం హాస్పిటల్కు తరలించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో తమకు ఇచ్చిన భూములను తమకు స్వాధీనం చేయండని ప్రభుత్వాన్ని టేకూరు నిర్వాసితులు కోరుతున్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల తాము భూముల లోకి వెళ్లలేక భౌతిక దాడులకు గురవుతున్నామని టేకూరు నిర్వాసితులు అంటున్నారు.