వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
(బెజ్జంకి) కరీంనగర్ : వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది.
మంథనికి చెందిన హోండా షోరూం ఓనర్ సదాశివ రెడ్డి(55), ఆయన కూతురు నిహారిక(14)తో కలిసి హైదరాబాద్ వెళ్లి తరిగి కారులో వస్తుండగా.. తోటపల్లి సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతుళ్లు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.