రోడ్డుప్రమాదంలో 'గీతమ్' విద్యార్ధుల మృతి | Two B.Tech Students died and One injured in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో 'గీతమ్' విద్యార్ధుల మృతి

Sep 19 2016 5:05 PM | Updated on Aug 30 2018 4:10 PM

సంగారెడ్డి మండలం కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీతం యూనివర్సిటీ విద్యార్థులు మృతిచెందారు.

సంగారెడ్డి (మెదక్ జిల్లా) : సంగారెడ్డి మండలం కంది సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గీతం యూనివర్సిటీ విద్యార్థులు మృతిచెందారు. సంఘటనాస్థలంలోనే అఖిలేశ్(19) మృతిచెందగా..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదిత్య(19) అనే మరో విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. గీతం యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్‌ఈ) సెకండియర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు వ్యక్తిగత పని నిమిత్తం సంగారెడ్డి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి నుంచి గీతం యూనివర్సిటీ(హైదరాబాద్)కి వస్తుండగా కంది దగ్గర బైక్‌పై కూర్చున్న ముగ్గురు యువకుల్లో ఒకరి బ్యాగు ట్రాక్టరుకు తగులుకుంది. దీంతో ముగ్గురూ కింద పడ్డారు. వెనకాలే వస్తున్న జిప్సీ వాహనం వీరిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుతాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement