నేటి నుంచి టీటీడీ డైరీ, క్యాలెండర్ల విక్రయం | TTD calendar sales from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీటీడీ డైరీ, క్యాలెండర్ల విక్రయం

Nov 17 2016 1:05 AM | Updated on Oct 20 2018 6:19 PM

నేటి నుంచి టీటీడీ డైరీ, క్యాలెండర్ల విక్రయం - Sakshi

నేటి నుంచి టీటీడీ డైరీ, క్యాలెండర్ల విక్రయం

నెల్లూరు(బృందావనం): స్థానిక రాంనగర్‌ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం నుంచి టీటీడీ 2017వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు విక్రయించనున్నట్లు టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌ రాంగోపాల్‌ తెలిపారు.

నెల్లూరు(బృందావనం):
స్థానిక రాంనగర్‌ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో గురువారం నుంచి టీటీడీ  2017వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు విక్రయించనున్నట్లు టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌ రాంగోపాల్‌ తెలిపారు. బుధవారం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను తన సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవస్థానం నుంచి నెల్లూరులో విక్రయించేందుకు '100విలువ చేసే డైరీలు మూడువేలు, పన్నెండు షీట్ల క్యాలెండర్లు 4500, సాధారణ క్యాలెండర్లు రెండు వేలు, తెలుగు క్యాలెండర్లు వెయ్యి సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిలో డైరీ 100, 12షీట్ల క్యాలెండర్‌ ఒక్కొక్కటి రూ.75, సాధారణ క్యాలెండరు రూ.10, తెలుగుక్యాలెండరు రూ.15గా విక్రయించనున్నామన్నారు. గూడూరు మాళవ్యనగర్‌లో ఉన్న టీటీడీ కల్యాణమండపంలో అందుబాటులో ఉంచుతామన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement