ఒకే కాన్పులో ముగ్గురు
ఆకివీడు : ఉండి గ్రామానికి చెందిన ఆళ్ల రామలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది.
ఆకివీడు : ఉండి గ్రామానికి చెందిన ఆళ్ల రామలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. రామలక్షి్మకి 8 నెలలు నిండగ నొప్పులు రావడంతో బుధవారం రాత్రి స్థానిక లక్ష్మీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో వైద్యురాలు కవిత గురువారం తెల్లవారుజామున రామలక్షి్మకి ఆపరేషన్ చేశారు. ఒకే కాన్పులో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్టు చెప్పారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఇది ఇలా ఉండగా రామలక్షి్మకి ఇది రెండో కాన్పు.. తొలి కాన్పులో ఆమె ఆడ పిల్లకు జన్మనిచ్చింది. రామలక్ష్మి భర్త శ్రీనివాస్ తాపీ మేస్రి్తగా పనిచేస్తున్నాడు.