కార్గిల్‌ వీరులకు శ్రద్ధాంజలి | tribute to kargil martyrs | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ వీరులకు శ్రద్ధాంజలి

Jul 26 2016 7:00 PM | Updated on Mar 28 2018 11:26 AM

కార్గిల్‌ వీరులకు శ్రద్ధాంజలి - Sakshi

కార్గిల్‌ వీరులకు శ్రద్ధాంజలి

మండలంలోని చీర్యాల నారాయణ గ్లోబల్‌ పాఠశాల్లో మంగళవారం కార్గిల్‌ విజయ్‌దివాస్‌ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు కొవ్వత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అలర్పించారు.

చీర్యాల నారాయణ గ్లోబల్‌ పాఠశాల్లో కార్గిల్‌ విజయ్‌ దివస్‌

కీసర : మండలంలోని చీర్యాల నారాయణ గ్లోబల్‌ పాఠశాల్లో మంగళవారం కార్గిల్‌ విజయ్‌దివాస్‌ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు కొవ్వత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అలర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ రామిడి రాంరెడ్డి మాట్లాడుతూ దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రుదేశాల నుంచి మన దేశాన్ని కాపాడుతున్న గొప్ప వ్యక్తులు జవాన్‌లేనన్నారు. కార్గిల్‌లో వీర మరణం పొందిన జవాన్ల ఆత్మ శాంతించాలని విద్యార్థులతో కలిసి ఆయన అంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, వీరజవాన్లపై ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement