ట్రాన్స్‌కో అధికారుల దాడులు | tranco officers attacks | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో అధికారుల దాడులు

Oct 3 2016 9:59 PM | Updated on Sep 4 2017 4:02 PM

పీక్లానాయక్‌తండా(మేళ్లచెర్వు): మండలంలోని పీక్లానాయక్‌తండాలో సోమవారం విద్యుత్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

పీక్లానాయక్‌తండా(మేళ్లచెర్వు):
మండలంలోని పీక్లానాయక్‌తండాలో  సోమవారం విద్యుత్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్‌ వాడుతున్న 78 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ నాగరాజు తెలిపారు. మీటర్లు లేకుండా బకాయిలు చెల్లించకుండ విద్యుత్‌ వాడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు 50 యూనిట్ల మేరకు ఉచితంగా వాడుకోవచ్చు అని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక మీదట ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్‌ వాడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో కోదాడ,చిలుకూరు ఏఈలు ,విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement