రైలు ఎక్కుతూ కింద పడి మహిళ మృతి | train accident.. woman dead | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతూ కింద పడి మహిళ మృతి

Jul 26 2016 1:33 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఏలూరు అర్బన్‌ : కూతురుని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మృతిచెందింది.

ఏలూరు అర్బన్‌ : కూతురుని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్సై ఎన్‌. రాము కథనం ప్రకారం..  విశాఖపట్నానికి చెందిన బోడిదాసు అంబికా ప్రసాద్, కమలవాణి (55) దంపతుల కూతురు కృష్ణాజిల్లా చిన అవుటపల్లిలో ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కమలవాణి కూతురును చూసుకునేందుకు శనివారం విశాఖపట్నం నుంచి చిన అవుటపల్లి వచ్చింది. అనంతరం ఆదివారం రాత్రి విశాఖ తిరిగి వెళ్లేందుకు గన్నవరంలో కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్‌ కింద పడి మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement