ఆటో ఢీకొని చిన్నారి మృతి | toddler dies after auto hits | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని చిన్నారి మృతి

Jan 28 2017 7:03 PM | Updated on Sep 5 2017 2:21 AM

ఆటో ఢీకొని చిన్నారి మృతి

ఆటో ఢీకొని చిన్నారి మృతి

పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారిని ఆటో ఢీకొనడంతో మృతిచెందిన సంఘటన కరీంనగర్‌జిల్లా ముత్తారం మండలం ఓడేడులో శనివారం సాయంత్రం జరిగింది.

ముత్తారం:
పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారిని ఆటో ఢీకొనడంతో మృతిచెందిన సంఘటన కరీంనగర్‌జిల్లా ముత్తారం మండలం ఓడేడులో శనివారం సాయంత్రం జరిగింది. కలికోట శ్రీనివాస్‌, సుస్మితల కుమార్తె సింధు(4) అక్షర పాఠశాలలో చదువుతోంది. తల్లి కూడా అదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. సాయంత్రం పాఠశాల నుంచి వ్యాన్‌లో వచ్చిన సింధు ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీకొంది.

తీవ్రంగా గాయపడిన ఆమెను ముత్తారం పీహెచ్‌సీకి, అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం మంథని తరలించగా అక్కడ మృతిచెందింది. స్థానికులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement