గొంతులో జామకాయ అడ్డుపడి చిన్నారి మృతి | toddler dies after ate guva in khamma district | Sakshi
Sakshi News home page

గొంతులో జామకాయ అడ్డుపడి చిన్నారి మృతి

Sep 22 2015 8:26 AM | Updated on Apr 3 2019 8:07 PM

జామకాయ తింటూ అది గొంతులో అడ్డుపడటంతో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారం శివారు రేపల్లెవాడలో సోమవారం జరిగింది.

పాల్వంచ రూరల్: జామకాయ తింటూ అది గొంతులో అడ్డుపడటంతో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారం శివారు రేపల్లెవాడలో సోమవారం జరిగింది. రేపల్లెవాడకు చెందిన కె.రవి, సుజాత దంపతుల రెండో కూతురు అమ్ములు సోమవారం సాయంత్రం ఇంట్లో జామకాయతో ఆడుకుంటూ తినబోయింది. ఆ జామకాయ గొంతులో ఇరుక్కుపోవడంతో అస్వస్థతకు గురైంది.

హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యునికి చూపించి అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా చిన్నారి మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement