ఉగాది ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీశైల ఆలయప్రాంగణంలో జరుగుతున్న రుద్ర, చండీహోమాలకు గురువారం ఉదయం 9.45గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది.
నేడు ఉగాది యాగాలకు పూర్ణాహుతి
Mar 29 2017 10:53 PM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం : ఉగాది ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీశైల ఆలయప్రాంగణంలో జరుగుతున్న రుద్ర, చండీహోమాలకు గురువారం ఉదయం 9.45గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది. అక్కమహాదేవి అలంకార మండపంలో అదే రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవిని నిజాలంకరణలో, శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆధిష్టింపజేసి వాహనపూజలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తరీతిలో చేస్తారు. కాగా ఈ నెల26 నుంచి ప్రారంభమైన ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి, వసంతోత్సవ కార్యక్రమాలతో గురువారం ముగింపు సూచనగా వివిధ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
Advertisement
Advertisement