ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి | To utilize internet | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Aug 24 2016 10:05 PM | Updated on Sep 4 2017 10:43 AM

ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గుండాల : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కోరారు.

గుండాల : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత కోరారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌వీ నాయకులు అన్నెపర్తి భిక్షం ఏర్పాటు చేసిన ఇంటర్నెట్‌ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్‌ ద్వారా బ్యాంకు లావాదేవిలతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చిందం ప్రకాశ్, జేఏసీ చైర్మన్‌ జి. సోమిరెడ్డి మాజీ ఎంపీపీ హరితాదేవి, నాయకులు యాదగిరి, దశరథ, శ్రీనువాస్, రమేష్, తదితరులు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement