కనీస వేతనాలు అమలు చేయాలి | To implement minimum salaries | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు అమలు చేయాలి

Aug 14 2016 11:42 PM | Updated on Sep 4 2017 9:17 AM

కనీస వేతనాలు అమలు చేయాలి

కనీస వేతనాలు అమలు చేయాలి

సూర్యాపేట : వ్యవసాయ కార్మికులకు 2016లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సూర్యాపేట : వ్యవసాయ కార్మికులకు 2016లో ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్‌ భవన్‌లో నిర్వహించిన వ్య.కా.స డివిజన్‌ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల పోరాటం వల్ల చట్టాలు, జీఓలు వచ్చినా వాటిని గ్రామ స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు బొప్పని పద్మ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెమ్మాది వెంకటేవ్వర్లు, మట్టిపల్లి సైదులు, చినపంగి నర్సయ్య, పల్లేటి వెంకన్న, వెంకన్న, రాంచరణ్, అంజయ్య, బాబు, పారిజాత, బిక్షం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా యాతాకుల వెంకన్న, మట్టిపల్లి సైదులును ఎన్నుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement