ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణం కాలుష్యం పర్యావరణాలపై ప్రభావం అనే అంశంపై గొంతేరు కాలువ పరిరక్షణ కమిటీ, భీమవరం పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదిన సదస్సు నిర్వహించనున్నట్లు జల్లి రామ్మోహనరావు, ఎం శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ఆక్వాఫుడ్‌పార్క్ కాలుష్యంపై సదస్సు
Oct 8 2016 6:39 PM | Updated on Sep 4 2017 4:40 PM
భీమవరం: ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణం కాలుష్యం పర్యావరణాలపై ప్రభావం అనే అంశంపై గొంతేరు కాలువ పరిరక్షణ కమిటీ, భీమవరం పర్యావరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదిన సదస్సు నిర్వహించనున్నట్లు జల్లి రామ్మోహనరావు, ఎం శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమవరం పట్టణంలోని ఛాంబర్‌ఆఫ్‌కామర్స్ భవనంలో నిర్వహించే సదస్సుకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్ ఎంవీవీఎస్ స్వామి, బ్రహ్మజీరావు, పర్యావరణవేత్తలు వెలగ శ్రీనివాస్, పి మురళీకష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. ఈసదస్సుకు పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రామ్మోహనరావు, శ్రీనివాస్ కోరారు.
Advertisement
Advertisement