
యువత స్వయం ఉపాధి పొందాలి
నల్లగొండ రూరల్ : నిరుద్యోగులు స్వయం ఉపాధితో మరొకరికి ఉపాధి కల్పించవచ్చని ఎస్‌బీహెచ్ రైసెట్ సంస్థ డైరెక్టర్ ఎన్.సి.శ్రీధర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ బేసిక్స్‌పై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం సంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు.