‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’ | tirupathi court permits madhusudhan reddy can stay in bangulore | Sakshi
Sakshi News home page

‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’

Feb 9 2016 10:49 AM | Updated on May 29 2018 4:26 PM

‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’ - Sakshi

‘మధుసూదన్ రెడ్డి బెంగళూరులో ఉండొచ్చు’

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి బెంగుళూరులో ఉండడానికి అనుమతి ఇస్తూ...

తిరుపతి లీగల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి బెంగుళూరులో ఉండడానికి అనుమతి ఇస్తూ తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి శ్యామ్‌సుందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బియ్యపు మధుసూదన్ రెడ్డికి గత నెల 27న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఆయన నెలరోజుల పాటు నెల్లూరులోనే వుండాలని న్యాయమూర్తి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు బెంగుళూరులో ఉన్నారని, ఆరోగ్యరీత్యా తాను బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి తిరుపతి కోర్టులో పిటీషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఆయన బెంగుళూరు వెళ్లడానికి అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement