టై అండ్‌ డై విధానం బాగుంది | tie and die polacy is good | Sakshi
Sakshi News home page

టై అండ్‌ డై విధానం బాగుంది

Sep 21 2016 8:20 PM | Updated on Sep 4 2017 2:24 PM

టై అండ్‌ డై విధానం బాగుంది

టై అండ్‌ డై విధానం బాగుంది

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి టై అండ్‌ డై వస్త్ర తయారీ విధానం బాగుందని ఒడిశా రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు అన్నారు.

భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి టై అండ్‌ డై వస్త్ర తయారీ విధానం బాగుందని ఒడిశా రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు అన్నారు. నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని బజఘడ్, సోన్‌పూర్, సబల్‌పూర్‌ జిల్లాలకు చెందిన 14 మంది చేనేత కార్మికులు బుధవారం పోచంపల్లిని సందర్శించారు. చేనేత గృహాలు, సహకార సంఘం, హ్యాండ్లూమ్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు, రంగుల అద్దకం, చిటికి విధానం, డిజైన్‌లను పరిశీలించారు. అలాగే మార్కెటింగ్, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటును అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎన్‌హెచ్‌డీసీ ప్రతినిధి నీల మాధవపాత్ర, సూపర్‌వైజర్‌ ప్రధాన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, సూరపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement