‘చంపుతానని బెదిరిస్తున్నారు’ | 'Threatening to kill' | Sakshi
Sakshi News home page

‘చంపుతానని బెదిరిస్తున్నారు’

Dec 6 2016 12:17 AM | Updated on Aug 21 2018 5:51 PM

ముండ్లవారిపల్లి గ్రామానికి చెందిన టి.వెంకటరమణ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని అంగన్వాడీ కార్యకర్త సిద్దుహుసేనమ్మ ఆరోపించారు. సోమవారం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

ఎన్పీకుంట : ముండ్లవారిపల్లి గ్రామానికి చెందిన టి.వెంకటరమణ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని అంగన్వాడీ కార్యకర్త సిద్దుహుసేనమ్మ ఆరోపించారు. సోమవారం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. బంగారు తల్లి పథకం కోసం టి.వెంకటరమణ ఇదివరకు దరఖాస్తు ఇవ్వగా, దానిని తాను ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌కు అందజేశానని చెప్పారు. అయితే బంగారుతల్లి పథకం మంజూరు కాకపోవడంతో, అందుకు తనే కారణమని ఆదివారం ఇంటికి వచ్చి మద్యం మత్తులో తీవ్రపరుష పదజాలంతో దూషించాడని తెలిపారు. అదే సమయంలో తన భర్త రావడంతో ‘నీ అంతు చూస్తానంటూ’ బెదిరించి వెళ్లిపోయాడన్నారు. ఇతని నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరానన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement