మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది.
మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. గ్రామానికి చెందిన బాల లక్ష్మీ(16) అనే యువతికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు క్రిమిసంహారక మందు తాగించి చంపాలని ప్రయత్నించారు. చికిత్సనిమిత్తం వెంటనే యువతిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాల లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. యువతి స్పృహలోకి వస్తే గానీ పూర్తి వివరాలు తెలియవు. సదరు యువతి ఓ ఇంటర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.