యువకుడు అనుమానాస్పద మృతి | The mysterious death of a young man | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Dec 16 2016 10:47 PM | Updated on Aug 1 2018 2:29 PM

శిరివరం వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తుతెలియని యువకుడు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శివనారాయణ స్వామి అందించిన వివరాల మేరకు..

గార్లదిన్నె : శిరివరం వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తుతెలియని యువకుడు (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ శివనారాయణ స్వామి అందించిన వివరాల మేరకు.. గుడ్డాలపల్లి క్రాస్‌ సమీపాన 44వ నంబరు జాతీయరహదారికి అర కిలోమీటర్‌ దూరంలో గల వ్యవసాయ పొలాల్లో గుబురు వేప చెట్టులో ఓ యువకుడు ఉరికి వేలాడుతుండటాన్ని గొర్రెల కాపరులు గుర్తించారు. వీరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం నల్లగా మారి, గుర్తు పట్టలేని విధంగా ఉండి, దుర్వాసన వస్తుండటంతో.. వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. సమీపంలో టోపీ, ఒక జత చెప్పులు, బీర్‌ బాటిల్‌ పడి ఉన్నాయి. శనివారం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. హత్య, ఆత్మహత్యనా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement