కూతురు గొంతు కోసిన తల్లి | The mother cut throat of her daughter | Sakshi
Sakshi News home page

కూతురు గొంతు కోసిన తల్లి

Jun 14 2016 10:01 AM | Updated on Aug 29 2018 4:18 PM

నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

నార్కట్‌పల్లి మండలం గోపాలాయపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కూతురు గొంతు కోసి హతమార్చింది. వివరాలు..మునుగోడు మండలంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న నారగోని కల్పన అలియాస్ పారిజాతకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పుట్టు మూగ ఆ తర్వాత పోలియో వచ్చింది. భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కూతుర్ని డాక్టర్ల వద్ద చూపించినా పోలియో నయం కాలేదు.

 దీంతో కూతురు తనకు భారమైందని భావించిన కల్పన కూతుర్ని గోపాలాయపల్లి గ్రామంలోని శ్రీవారిజాల వేణుగోపాలస్వామి దేవాలయానికి ఒంటరిగా తీసుకువచ్చింది. అనంతరం కూతుర్ని బ్లేడుతో గొంతుకోసి తానూ గొంతుకోసుకుంది. అంతకు ముందే ఈ విషయాన్ని బంధువులకు తెలిపింది. బంధువులు 108 వాహనాన్ని తీసుకువచ్చి ఇద్దర్ని కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కూతురు సుమశ్రీ(9)ని హైదరాబాద్‌కు తరలించగా..చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement