భర్త చేతిలో దెబ్బలు తిని తీవ్రగాయాలపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని అక్కల్‌చెడ శివారు లచ్చినాయక్ తండాలో శుక్రవారం జరిగింది.
భర్త దాడిలో గాయపడిన మహిళ మృతి
Sep 17 2016 12:16 AM | Updated on Sep 4 2017 1:45 PM
చెన్నారావుపేట : భర్త చేతిలో దెబ్బలు తిని తీవ్రగాయాలపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని అక్కల్‌చెడ శివారు లచ్చినాయక్ తండాలో శుక్రవారం జరిగింది. ఎస్సై జగదీష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు చంద్రు చిన్న కుమారుడు రవికి కొత్తగూడెం మండలం ఓటాయి తండాకు చెందిన భూక్య జామ్ల–పాక్రిల కూతురు రమ(32)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి సంసార జీవితంలో కుమార్తెలు అశ్విని, మధుమతి, కుమారుడు నవీ¯ŒS జన్మించారు. సోమవారం రవి తన భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. రమ మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతురాలి తండ్రి జామ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement