ఈతకు వెళ్లి నలుగురు మృతి | The four young boys submerged tank | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి నలుగురు మృతి

May 23 2016 2:09 PM | Updated on Apr 3 2019 7:53 PM

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతిచెందారు.

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతిచెందారు. జిల్లాలోని కోస్గి ఉగేని చెరువులో సోమవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందారు.

 

స్థానిక కడపాలెం వీధికి చెందిన వెంకటేష్(10), బోయ నర్సింహులు(10), కురువ నర్సింహులు(10), బోయ వెంకటేష్(12) అనే నలుగురు పిల్లలు మరికొంత మంది స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో నీళ్లు లేకపోవడంతో.. పిల్లలు బురదలో చిక్కుకుని మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బోయ గోవింద్ అనే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఒకే కాలనికి చెందిన నలుగురు బాలురు మృతిచెందడంతో.. పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement