
ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి నామినేషన్ దాఖలు
చిత్తూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల స్థానానికి తొలి నామినేషన్
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల స్థానానికి తొలి నామినేషన్ మంగళవారం దాఖలైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన కాశినేని వెంకటసుధాకర్ రెడ్డి చిత్తూరు కలెక్టరేట్‌కు విచ్చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు నామినేషన్‌ను సమర్పించారు.
దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ బోణి అయ్యింది. అయితే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.