తేలుకాటుకు చిన్నారి మృతి | The death of a child is bitten by scorpion | Sakshi
Sakshi News home page

తేలుకాటుకు చిన్నారి మృతి

Aug 21 2016 12:30 AM | Updated on Sep 15 2018 7:55 PM

తేలుకాటుకు గురై చిన్నారి మృ తిచెందిన సంఘటన మండలంలోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ ఉమాకాంత్‌ కథనం ప్రకా రం.. రాంపూర్‌కు చెందిన తొట్టె రాజు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారైలు.

  • నాటువైద్యుడితో మంత్రం వేయించిన వైనం
  • చికిత్స అందడంలో జాప్యం
  • రాంపూర్‌(ధర్మసాగర్‌ ) : తేలుకాటుకు గురై చిన్నారి మృ తిచెందిన సంఘటన మండలంలోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ ఉమాకాంత్‌ కథనం ప్రకా రం.. రాంపూర్‌కు చెందిన తొట్టె రాజు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారైలు.  వీరిది వ్యవసాయ కుటుంబం. కాగా వీరంతా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సా యంత్రం తమ వ్యవసాయ బావి వద్దకు వన భోజనాలకు వెళ్లారు. అక్కడే ఆడుకుంటున్న వీరి పెద్ద కూతురు తొట్టె అక్షిత(06) ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది. దీంతో అక్షి త ఆడుకుంటున్న పరిసరాల్లో చూడగా తేలు కనిపించిం ది. తమ పాపను ఆ తేలు కుట్టినట్లుగా భావించి దాన్ని చంపేశారు. తేలు మంత్రం వేస్తే తమ చిన్నారి ప్రాణాలు దక్కుతాయని తల్లిదండ్రులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే పాపను ఓ నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి మంత్రం వేయించినట్లు సమాచారం. అనంతరం కొద్దిసేపు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపించిన చిన్నారి.. మళ్లీ కాసేపటికే స్పృహను కో ల్పోయింది. పాపను హన్మకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీ సుకెళ్లగా, అక్కడ చేర్చుకునేందు కు నిరాకరించారు. దీంతో ఎంజీ ఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని ఆరోగ్య పరి స్థితి విషమించడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం ఉదయం అక్షిత కన్నుమూసింది. ఆమె కాజీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement