రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది.
కెరమెరి(ఆదిలాబాద్)
రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం దువుడుపల్లి గ్రామానికి చెందిన రంజిత్, వాణి దంపతుల కుమార్తె సహస్ర(ఏడాది) రక్త హీనతతో బాధపడుతోంది. ఆమెను తల్లి దండ్రులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె 12 రోజులుగా చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో సహస్ర గురువారం ఉదయం చనిపోయింది. చిన్నారి సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు.