ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
హుజూర్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ అన్నారు.
హుజూర్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన వివిధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను సవరణల పేరుతో కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అందజేయకుండా వారి సంక్షేమాన్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూసీ నాయకులు శీతల రోశపతి, మేకల నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణ, చిలకరాజు లింగయ్య, వంటిపులి శ్రీనివాస్, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, నర్సింహారావు, జానయ్య, ముస్తఫా, వెంకటరెడ్డి, పుల్లయ్య, సావిత్రి, రవికుమార్, కరుణాకర్‌రెడ్డి, హుస్సేన్ గౌడ వీరబాబు, లాలుగౌడ్ పాల్గొన్నారు.