మండల కేంద్రానికి చెందిన ఈశ్వరమ్మ, అల్లూరయ్య దంపతుల కుమారుడు పవన్ (7) శనివారం నీటికుంటలో పడి మృతి చెందాడు.
నీటికుంటలో పడి బాలుడు మృతి
Apr 29 2017 11:49 PM | Updated on Jul 12 2019 3:02 PM
పాణ్యం : మండల కేంద్రానికి చెందిన ఈశ్వరమ్మ, అల్లూరయ్య దంపతుల కుమారుడు పవన్ (7) శనివారం నీటికుంటలో పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ వివరాల మేరకు.. తోటి బాలురతో కలసి పాణ్యం చెరువులో ఉన్న ఓ నీటికుంట వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన పవన్.. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. పిల్లలందరూ ఇంటికి వచ్చినా పవన్ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి గాలించగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మార్కాపురం నుంచి పాణ్యం వచ్చారు. బొంతలు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. చివరి వాడు మృత్యువాతపడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement