క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి | The beginning of church | Sakshi
Sakshi News home page

క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి

Feb 26 2017 11:11 PM | Updated on Mar 28 2018 11:26 AM

క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి - Sakshi

క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి

క్రైస్తవులు అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

► రాష్ట్ర రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి
► మరియాపురంలో పునీత ఆరోగ్యమాత చర్చి ప్రారంభం

షాబాద్‌: క్రైస్తవులు అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మరియాపురంలో రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన పునీత ఆరోగ్యమాత చర్చిని బిషప్‌ తుమ్మబాల, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, విశాఖ ట్రైనీ బిషప్‌ చిన్నప్పరెడ్డి, టీఆర్‌ఎస్‌ యూత్‌ జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలతో ఆయన కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు.

బంగారు తెలంగాణ సాధనకు క్రైస్తవులు భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోనే అతి పెద్ద చర్చి మరియాపురంలో నిర్మించడం గర్వకారణమన్నారు. ప్రతి యేటా క్రిస్‌మస్‌ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టించేందుకు పాటుపడుతున్నామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకున్నపు్పడే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు.

కార్యక్రమంలో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్  శేరిగూ డె ం వెంకటయ్య, జెడ్పీటీసీ జడల లక్ష్మీ రాజేందర్‌గౌడ్, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఎంపీడీఓ పద్మావతి, పాస్టర్లు కొండారెడ్డి, ఆగస్టన్ రెడ్డి, స్థానికులు ఆంథోనిరెడ్డి, మర్రెడ్డి, పాపిరెడ్డి, బాలస్వామిరెడ్డి, విజయబాస్కర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాయకులు ఎంఏ మతిన్ , ఈదుల నర్సింలు గౌడ్, వెంకటయ్య, నర్సింహారెడ్డి, వెంకటేష్‌ గౌడ్, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పర్వేద నర్సింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement