breaking news
Bishop tummabala
-
అందరినీ ఆదరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఏరకమైన అభ్యంతరాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నూటికి నూరు శాతం సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని, ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని, అందరినీ ఆదరించే రాష్ట్రమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భారత్ గొప్ప దేశ మని ఇక్కడ జరుపుకున్నన్ని పండుగలు ప్రపంచంలో మరెక్కడా జరుపుకోరన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్లామిక్ దేశాలలో రంజాన్, బక్రీద్ పండుగలు, ఇతర దేశాలలో నాలుగైదు పండుగలు జరుపుకుంటారని, కానీ భారత్‌లో జరుపుకు నేవి చాలా ఉన్నాయన్నారు. ‘ఉత్సవాలు జరుపుకునే గుణం, సహనంతోపాటు మనుషులను ప్రేమించే తత్వం ఉంటే ఇది సాధ్యపడుతుంది. దానికి నా తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం. క్రిస్మస్ వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్, బతుకమ్మ, ఇప్పుడు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాము’అని సీఎం అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరితో పాటు క్రైస్తవులకు అందిస్తున్నామని, ఎవరికైనా పథకాలు అందకపోతే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి చెప్పాలని సూచించారు. త్వరలో క్రైస్త్త్తవ మత నాయకులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని సీఎం ప్రకటించారు. ఉత్సవాల్లో బిషప్ షపర్డ్ రెవరెండ్ గొల్లపల్లి జాన్, బిషప్ తుమ్మ బాల, మంత్రులు శ్రీనివాసగౌడ్, శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
క్రైస్తవుల అభ్యున్నతికి సర్కారు కృషి
► రాష్ట్ర రవాణా శాఖమంత్రి మహేందర్‌రెడ్డి ► మరియాపురంలో పునీత ఆరోగ్యమాత చర్చి ప్రారంభం షాబాద్: క్రైస్తవులు అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మరియాపురంలో రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన పునీత ఆరోగ్యమాత చర్చిని బిషప్ తుమ్మబాల, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, విశాఖ ట్రైనీ బిషప్ చిన్నప్పరెడ్డి, టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాష్‌రెడ్డిలతో ఆయన కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనకు క్రైస్తవులు భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. జిల్లాలోనే అతి పెద్ద చర్చి మరియాపురంలో నిర్మించడం గర్వకారణమన్నారు. ప్రతి యేటా క్రిస్మస్ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టించేందుకు పాటుపడుతున్నామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకున్నపు్పడే మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శేరిగూ డె ం వెంకటయ్య, జెడ్పీటీసీ జడల లక్ష్మీ రాజేందర్‌గౌడ్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, ఎంపీడీఓ పద్మావతి, పాస్టర్లు కొండారెడ్డి, ఆగస్టన్ రెడ్డి, స్థానికులు ఆంథోనిరెడ్డి, మర్రెడ్డి, పాపిరెడ్డి, బాలస్వామిరెడ్డి, విజయబాస్కర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, నాయకులు ఎంఏ మతిన్ , ఈదుల నర్సింలు గౌడ్, వెంకటయ్య, నర్సింహారెడ్డి, వెంకటేష్ గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్వేద నర్సింలు పాల్గొన్నారు.